గోవాలోని ఆ పశువులు గ్రాసం మాత్రం తినవు. ఓన్లీ చికెన్ మాత్రమే తింటాయంటే నమ్ముతారా..? నమ్మితీరాల్సిందే. గోవాలో రోడ్డుపై పడిన పశువులు పనాజీలోని గోశాలలో పరిరక్షించబడుతున్నాయి. రోడ్డుపై తిరుగుతూ వుండిన ఆ ఆవులు రోడ్డుపై లభించే ఆహారాన్ని తింటూ వచ్చాయి. వీటిలో చికెన్, మటన్, ఫిఫ్ ఫ్రైలు తింటూ ఎక్కువగా తినేవని తెలిసింది.
సాధారణంగా పశువులు గ్రాసాన్ని మాత్రమే తీసుకుంటాయి. కానీ ఈ పశువులు మాత్రం చికెన్, మటన్, చేపలు మాత్రమే తింటున్నాయి. రోడ్డుపై నున్న హోటళ్ల నుంచి బయటపడే చికెన్, మటన్, తిన్న గోవులు.. గోశాలలో వేసే గ్రాసాన్ని తినట్లేదని అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మార్చేందుకు గోశాల అధికారులు చికిత్స ప్రారంభించారని గోవా మంత్రి మైకేల్ తెలిపారు.
మాంసాహారం నుంచి శాకాహారం తీసుకునేలా అందించే చికిత్స ద్వారా గోవులు శాకాహారుగా మారుతాయని చెప్పారు. సాధారణంగా గోవులు మాంసాహారాన్ని ముట్టుకోవు. ఇళ్ళల్లో పెంచే ఆవులు మిగిలిన అన్నం, గంజినీళ్లు వంటివి తాగుతుంటాయి. గోవులకు అందించే ఆహారంలో ఏమాత్రం మాంసాహారం కలపటం చేయరు. అది పాపమని చెప్తుంటారు.