వైసీపీలోకి ద‌గ్గుబాటి - మ‌రింత వేడెక్కిన ఏపీ రాజ‌కీయం..!

ఆదివారం, 27 జనవరి 2019 (21:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఈసారి ఏ పార్టీ అధికారం ద‌క్కించుకోనుంది అని రోజురోజుకు ఆస‌క్తి పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డితో డా.దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కొడుకు హితేష్ చెంచురాం సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు నుండి హితేష్ చెంచురాం వైసీపి నుండి‌ బరిలోకి దిగుతారని గ‌త కొన్ని రోజులుగా ప్రచారం జ‌రుగుతోంది. 
 
హైద‌రాబాద్ లోని జ‌గ‌న్ ఇంటికి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న త‌న‌యుడు హితేష్ చెంచురాం రాగానే వైసీపీ నేత విజయసాయిరెడ్డి వాళ్లను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. ద‌గ్గుబాటి  ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేర‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ప‌ర్చూరు స్థానం పైన జగన్ నుంచి హామీ లభిస్తే భార్య పురందేశ్వరి, కుమారుడు హితేశ్‌తో కలిసి దగ్గుబాటి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. మ‌రి.. జ‌గ‌న్ ద‌గ్గుబాటి కోరుకున్న‌ట్టు హామీ ఇస్తారా..? లేదా..?  అనేది తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు