కాగా, మరణించినవారిలో బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన చోట పెద్ద సుడిగుండం ఉంటుందని, అక్కడ బోటును అదుపుచేయడంలో డ్రైవర్లు విఫలం కావడంతోపాటు, బోటుపైకి ప్రయాణికులు ఒకే సారి పెద్ద సంఖ్యలో చేరడం కూడా ప్రమాదానికి దారితీసిందని అంచనా వేస్తున్నారు.
గత రెండు నెలలుగా గోదా వరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నదీ తీర గ్రామాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రమాదకర సమయంలో పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ బోట్‌ల యాజమాన్యాలు దేవీపట్నం గోదావరిపై వరదల సమయంలో విహారయాత్రలకు బోట్‌లను తిప్పుతున్నారు.