మహారాష్ట్ర - హర్యానాల్లో కమల వికాసం : ఎగ్జిట్ పోల్స్
సోమవారం, 21 అక్టోబరు 2019 (20:10 IST)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఆ తర్వాత పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అన్ని సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో తిరిగి కాషాయ జెండా విజయకేతనం ఎగురవేస్తుందని తేల్చాయి. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.
ఈ ఫలితాల వివరాలను పరిశీలిస్తే,
మహారాష్ట్ర (288 సీట్లు)
టైమ్స్ నౌ : బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు.