పిజ్జా, బర్గర్లు వద్దు.. చికెన్ బటర్, పనీర్ బటర్ మసాలా అమ్మండి..

ఆదివారం, 2 జూన్ 2019 (17:15 IST)
విద్యార్థులకు కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ డిష్‌లను విక్రయించకూడదని పాఠశాల, కళాశాలలకు ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల లేదా కాలేజీల్లోని క్యాంటీన్లలో కూల్‌డ్రింక్స్, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌పుడ్స్‌ను విక్రయించకూడదని.. వాటిని అధికంగా తీసుకునే విద్యార్థులను అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 
 
దీన్ని నిరోధించేందుకు ముంబై రాష్ట్ర సర్కారు నడుం కట్టింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన బృందం క్యాంటీన్లలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాలని.. ఇందుకోసం సదరు పాఠశాల, కళాశాలను ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
నాణ్యతతో పాటు తయారీ తేదీలను కూడా పరిశీలించాలని పేర్కొంది. ఇందులో భాగంగా ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ రెండు వేల పాఠశాలలు, కళాశాల ప్రిన్స్‌పాల్‌కు లేఖ రాసింది. అంతేగాకుండా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మడం చేయాలని ఆ శాఖ ఆదేశించింది. బర్గర్లు, పిజ్జాలకు బదులు చికెన్ బటర్ మసాలా, పనీర్ బటర్ మసాలాను అమ్మాలని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు