అయితే, ఈ వైరస్ గాలిద్వారా సోకుతుందనే భయం ప్రజల్లో ఉత్పన్నమైంది. దీనిపై హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పందించారు. మంకీపాక్స్ లక్షణాలతో తమ ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని తెలిపారు.
తాజాగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరగా, అతని నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని ఎన్.ఐ.వి పరిశోధనాశాలకు పంపించినట్టు చెప్పారు. ఈ రిపోర్టులు మంగళవారం సాయంత్రానికి వస్తాయని తెలిపారు. ఈ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి నగరానికి వచ్చారని తెలిపారు.
మరోవైపు, ఈ వైరస్ గాలిద్వారా వ్యాపిస్తుందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అందువల్ల ఈ ప్రచారంపై ప్రజలు భయపడవద్దని ఆయన కోరారు. అయితే, మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమచారా ఇవ్వాలని, 6 నుంచి 13 రోజుల్లో ఈ వ్యాది లక్షణాలు బయటపడతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.