తెలంగాణ రాష్ట్ర పండుగగా గాంధీ జయంతి

బుధవారం, 2 అక్టోబరు 2019 (08:58 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా బుధవారం జరుగనున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా, గాంధీ 150వ జయంతి వేడుకల పేరుతో పేరుతో వీటిని నిర్వహిస్తున్నాయి. ఇందులోభాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గాంధీ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని నిర్ణయించింది. అన్ని శాఖలు బుధవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఖర్చును ఆయాశాఖల బడ్జెట్ నుంచి వెచ్చించాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ (సాధారణ పరిపాలనా విభాగం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
దక్షిణాఫ్రికాకు ప్రయాణమైన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఆ దేశంలో ఆ తర్వాత భారత దేశంలో అనేక అనుభవాల రాపిడికి గురై మహాత్మాగాంధీగా పరిణతి చెందారు. సామాన్యుడు అసామాన్యుడిగా రూపుదిద్దుకున్న క్రమం వెనుక కఠోర శ్రమ ఉన్నది. 
 
గాంధీ అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకునేవారు. తనను తాను సంస్కరించుకునేవారు. జీవితకాలం సాగిన ఈ మేధోమథనం, క్రమశిక్షణాయుత ప్రయోగాల ద్వారా గాంధేయవాదం ఒక అహింసాయుత ఆయుధంగా అందివచ్చింది. ఆ అహింసాయుత ఆయుధంతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు