గణేశ్ నిమజ్జనం.. అప్పుడు 2 రోజులు.. ప్రస్తుతం ఒకరోజే..

గురువారం, 12 సెప్టెంబరు 2019 (10:05 IST)
వినాయకుడి నిమజ్జనాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇదివరకు వినాయక నిమజ్జనం అంటే రెండు రోజుల పాటు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయమే నిమజ్జనానికి తరలించారో.. అప్పటి నుంచీ దాదాపు ఒకే రోజున వినాయక నిమజ్జనం పూర్తవుతోంది. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చెయ్యడం వల్ల నిమజ్జనం అర్థరాత్రి కల్లా పూర్తవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 
 
అంతేగాకుండా.. ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలో విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే ఖరారు చేయడం వల్ల నిమజ్జనం సాఫీగా సాగిపోయే అవకాశం వుంది. ఇంకా 20వేల మంది పోలీసుల భద్రత, 23 చెరువుల్ని నిమజ్జనానికి రెడీ చేయడం ద్వారా.. నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగే అవకాశాలున్నాయి. ఇందుకోసం 32 ప్రాంతాల్లో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. 
 
బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ నుంచీ హుస్సేన్‌సాగర్ వరకూ శోభాయాత్ర జరుగనుండటంతో  ట్రాఫిక్ ఆంక్షలు అమలు అయ్యాయి. శోభాయాత్రలో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం..  అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే.. ఈ ఏడాది హైదరాబాద్‌లో 60 వేల విగ్రహాల్ని భక్తులు ప్రతిష్టించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు