నడిరోడ్డు.. స్విమ్ సూట్.. బైకుపై కూర్చుని..తొడలకు వాక్సింగ్ (video)

బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:08 IST)
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనో లేకుంటే ఏదో క్రేజ్ కోసమో కొందరు అదే పనిగా సీక్రెట్‌గా చేయాల్సిన పనులు ఓపెన్‌గా చేసేస్తున్నారు. మనదేశంలోనే స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో పాశ్చాత్య పోకడలు సీన్లోకి వచ్చేశాయి. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ యువతి స్విమ్ సూట్‌లో బైకుపై ప్రయాణించింది. 
 
అంతటితో ఆగకుండా.. బైకుపైన కూర్చుని తొడలకు వాక్సింగ్ చేసుకుంది. ఈ ఘటన మియామి నగరంలో చోటుచేసుకుంది. మియామీలో పట్టగపగు రోడ్డండా వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా వున్న సమయంలో సిగ్నల్ పడింది. ఇంతలో ఓ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడటంతో వాహనాలు ఆగాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెనక కూర్చున్న ఓ యువతి స్విమ్ సూట్‌లో కూర్చొంది. 
 
సిగ్నల్ పడగానే... ఓ రేజర్‌తో తన కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించుకుంది. ఈ తతంగాన్ని ఆ బైకు వెనకే వున్న వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలై కూర్చుంది. 
 
ఇంకా ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. టైమ్ లేకపోవడంతోనే ఆమె ఇలా బైకులో జర్నీ చేస్తూ వాక్సింగ్ చేసుకుందని కొందరు అంటున్నారు. అమ్మాయి మాత్రం నడిరోడ్డుపై రేజర్ పట్టుకొని వాక్సింగ్ చేసుకోవడంపై మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంట్లోనూ, బ్యూటీపార్లర్లకు వెళ్లి ఈ పని చేసుకోవచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను 777,984 మంది వీక్షించారు. ఈ వీడియోనూ మీరూ ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు