ఈ ప్రచారంలో భాగంగా, విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మోడీని సీఎం సిద్ధరామయ్య కలవాలనుకుంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. కర్ణాటకను దేశంలో నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని ఆమె గుర్తుచేశారు. మోడీ గొప్ప వక్త అన్న సోనియా… ఆయన మాటలు దేశంలో ఎవరి కడుపు నింపబోవన్నారు.