చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2 మిషన్ ద్వారా నింగిలోకి పంపిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్.. విక్రమ్ పడిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇస్రో పేర్కొన్నది.
అయితే, విక్రమ్ ల్యాండర్‌తో ఎటువంటి కమ్యూనికేషన్ జరగలేదని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 7వ తేదీ అర్థరాత్రి 1.51 నిమిషాల సమయంలో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగుతూ కుదేలుకు (హార్డ్ ల్యాండింగ్) గురైంది. ఆ సమయంలో ల్యాండర్ వెలాసిటీ అదుపుతప్పడంతో అది స్టాఫ్ ల్యాండింగ్ స్థానంలో హార్డ్ ల్యాండింగ్ అయింది. దీంతో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ బ్రేకయ్యాయి.