భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు, రక్షణకు భంగం కలిగించే కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తేలడంతో 43 మొబైల్ యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా నిషేధించబడిన యాప్స్‌లో నాలుగు చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా గ్రూప్ యాజమాన్యానికి చెందినవి ఉన్నాయి.
"43 మొబైల్ యాప్స్ ప్రాప్యతను నిరోధించే సమాచార సాంకేతిక చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది" అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందుకున్న సమగ్ర నివేదికల ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.