కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం - హైదరాబాద్‌కు తరలింపు

సోమవారం, 25 జులై 2022 (08:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం చెలరేగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ బాధితుడిని హుటాహటిన హైదారాబాద్ నగరానికి తరలించి ఫీవర్ ఆస్పత్రిలో చేర్చారు. 
 
ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఈ కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగుకు చేరుకున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి కట్టడిపై దృష్టిసారించింది.
 
ఈ నేపథ్యంలో తెలంగాణలోని కామారెడ్డిలో ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది. కువైట్‌ నుంచి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 
 
ఈ నెల 6న కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఈనెల 20న జ్వరం, 23న దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ లక్షణాలుగా అనుమానించి ఆదివారం బాధితుడ్ని హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు