ఇప్పటి వరకు ముర్ముకు 2,161 ఓట్లు రాగా వాటి విలువ 5,77,777. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు రాగా వాటి విలువ 2,61,062. కాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇప్పటికే శ్రీమతి ముర్ముని అభినందించారు. " మొదటిసారిగా రాష్ట్రపతిగా ఓ గిరిజన మహిళను ఎన్డీఏ తరపున ఎంపిక చేసినందుకు, దేశానికి ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా అందించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. అస్సాంలో సంపూర్ణ ఆనందం ఉంది, ముఖ్యంగా తేయాకు తోటలలో, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు," అన్నారాయన.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్‌లోని కొందరు సీనియర్ సభ్యులు, బిజెపి చీఫ్ జెపి నడ్డా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆమెను అభినందించడానికి తీన్‌మూర్తి మార్గ్‌లో తాత్కాలికంగా బస చేస్తున్న ద్రౌపది ముర్ముని సందర్శించి అభినందనలు తెలిపేందుకు వెళ్లనున్నట్లు సమాచారం.