ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన క్షణం. ప్రతి ఒక్కరూ ఈ క్షణాన్ని తమ జీవితాంతం గుర్తుంచుకోవడానికి భిన్నంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే రాహుల్ - అరుషి జంట, వివాహంతో తొలి రాత్రి వీడియోను నేరుగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో రాహుల్ -అరుషిలపై ట్రోల్స్ మొదలైయ్యాయి.
పెళ్లి తర్వాత తమ తొలి రాత్రి వీడియోను ఓ జంట ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియోలో, జంట వారి గదిలో కనిపించింది. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. పెళ్లికూతురు నగలు తీసేయడం, భర్త ఆమెను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి కనిపించాయి.
నగలు, బట్టలు తీసేయడంలో కూడా ఆమెకు సాయం చేస్తున్నాడు. ఆ వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లలో ఒకరు, ఇది మీ ప్రైవేట్ క్షణం, దీన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.