గుట్టుచప్పుడుకాకుండా #MasoodAzhar విడుదల

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:07 IST)
జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను పాకిస్థాన్ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసింది. దీంతో ఉగ్రవాదంపై తమబుద్ధి ఏమాత్రం మారబోదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశం మేరకు మసూద్ అజర్‌ను పాకిస్థాన్ ఇటీవల అరెస్టు చేసింది. 
 
అయితే, ఆయన్ను ఇపుడు పాకిస్థాన్ రహస్యంగా విడుదల చేసింది. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది. భారత్-పాక్ సరిహద్దులోని రాజస్థాన్ - కాశ్మీర్ సెక్టారులో పెద్ద కుట్రకు పాక్ పావులు కదుపుతోందన్న ఐబీ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన విషయం తెల్సిందే. దీన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. 
 
పైగా, భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ సరిహద్దులో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించింది. భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరించారు. అందులో భాగంగానే ఇప్పుడు మసూద్‌ను వదిలిపెట్టినట్టు ఐబీ భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు