సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి రాష్ట్ర మంత్రి : పవన్ కళ్యాణ్

మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:29 IST)
ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. గ్రామ సర్పంచ్‌గా కూడా గెలవలేని నారా లోకేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, ఇది మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.
 
ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. 'విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా?' అంటూ ఆయన నిలదీశారు. 
 
స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు