గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల

శుక్రవారం, 2 నవంబరు 2018 (16:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరికొత్త రీతిలో ప్రజాపోరాట యాత్ర చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత గాంధీజీ ఏ రైలు యాత్రను చేపట్టారో అదే యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు ప్రజలతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ యాత్ర గురువారం సాయంత్రం 5.20 గంటలకు ముగియనుంది. 
 
దేశంలో రైలు యాత్రలు చేపట్టిన పార్టీ అధినేతలలో పవన్ ఒకరు. మహాత్మగాంధీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ రైలు యాత్రకు శ్రీకారం చుట్టారు. రైలులో ప్రయాణిస్తూ అసంఘటిత కార్మికులతోనూ, ఏలూరులో అసంఘటిత వర్తకుల సమస్యలను జనసేనాని అడిగి తెలుసుకున్నారు.   ప్రయాణికులతోనూ, మామిడి రైతులతోనూ మాట్లాడారు.
 
అనంతరం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కూడా ప్రజలతో మమేకమయ్యారు పవన్‌కల్యాణ్. తదనంతరం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, సామర్లకోటలలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీయనున్నారు. అలా సాయంత్రం 5.20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ రైలు యాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత తుని చేరుకుని తునిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కాగా పవన్ కల్యాణ్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనాని వెంటనే వున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు