భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రజాదారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మన దేశంలోనేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మంచి పేరుంది. అయితే, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మరోమారు మంచి ప్రజదారణ కలిగిన నేతగా మరోమారు ఎంపికయ్యారు.
ముఖ్యంగా, భారత్‌లోని వయోజనుల్లో 71 శాతం మోడీని తమ నేతగా ఆమోదిస్తున్నారు. ఈ వివరాలను అమెరికుక చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాక్ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 13 మంది నేతలకు సంబంధించి సర్వే నిర్వహించింది.
ఇజ్రాయేల్ ప్రధాని మారియో 60 శాతం, జపాన్ ప్రధాి కిషిదకు 48 శాతం ప్రజాదారణ లభించింది. ఈ 13 మందిలో బ్రిటన్ అధినేత బోరిస్ జాన్సన్‌కు కేవలం 26 శాతం మాత్రమే లభించడంతో జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 43 శాతం ప్రజామోదం లభించింది.