వరద ఉధృతి, అంబులెన్స్ వచ్చేస్తోంది. కానీ వయస్సులో చిన్నవాడైనా ధైర్యంతో ముందుకెళ్లాడు. అంతేగాకుండా వరదలతో మునిగిపోయిన బ్రిడ్జిపై ధైర్యంగా ముందుకు దాటుతూ అంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఇదంతా చేసింది.. 12 ఏళ్ల బాలుడు మాత్రమే.
ఇంతలో 12ఏళ్ల వెంకటేశ్ అనే బుడ్డోడు అక్కడికి చేరుకున్నాడు. వెంటనే తానున్నాను పదా అంటూ ధైర్యంగా ముందుకు సాగాడు. నీటిలో పడుతూ లేస్తూ ముందుకు నడుస్తూ ఆంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఆ బుడ్డోడిని అనుసరిస్తూ అంబులెన్స్ ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా వెంకటేశ్ చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.