సంక్రాంతి పండుగకు కోడిపందేలు జోరుగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటిలాగే ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో జోరుగా బెట్టింగులు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో జరిగిన ఓ కోడిపందెంలో మౌనంగా ఎలాంటి పోరాటం చేయకుండా కోడిపుంజు గెలిచింది. దీని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాలను చూస్తే... పందెంలోకి 5 కోడిపుంజులను వదిలారు. బరిలో నాలుగు కోడిపుంజులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. దాంతో పందెం పడిన నాలుగు కోళ్లు నేలకొరిగాయి. మౌనంగా ఇదంతా చూస్తూ నిలబడ్డ కోడిపుంజు విజేతగా నిలిచింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.... చూసారా... మౌనంగా వుంటే విజయం తథ్యం... అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కోడిపుంజుపై కోటి రూపాయలు పందెం కాయగా పోటీలో గుడివాడ ప్రభాకర్ రావు గెలిచి కోటి రూపాయలు కైవసం చేసుకున్నారు.