ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నరసింహన్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. రాష్ట్రం విడిపోయినా విభజన సమస్యల మీద ఆయనకు ఉన్న సంపూర్ణమైన అవగాహన నేపథ్యంలో కేంద్రం ఆయన్నే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగించింది. ముందుగా యూపీఏ -2 ప్రభుత్వంలో ఆయన గవర్నర్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన్ను బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు వెల్లడించింది.
అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్రం మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణకు తమిళిసై సౌందర్‌రాజన్, హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజస్థాన్‌కు కల్‌రాజ్ మిశ్రా, మహారాష్ట్రకు భగత్‌సింగ్, కేరళకు మహ్మద్ ఖాన్ కొత్త గవర్నర్లుగా నియమితులయ్యారు.