కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయడం, ఇతర అవసరమైన మందులు, పరికరాలను అందజేస్తుండటం మనమంతా చూస్తున్నదే. జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇటీవలే తెలిపాడు.
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలాఖరులో ఏపీలోని ఆత్మకూరు, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ భారతదేశానికి మద్దతునిచ్చే సమయమిదని సోనూసూద్ అన్నారు.
కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి తన సేవలు కొనసాగిస్తున్నాడు. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేశాడు. ఇప్పుడు కొనసాగుతున్న రెండవ సీజన్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు.