బాలకృష్ణ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు వున్నది కూడా పోతుంది: లక్ష్మీపార్వతి

శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:12 IST)
బాలక్రిష్ణ గురించి మాట్లాడటం నాకైతే అనవసరం అనిపిస్తుంది అంటున్నారు లక్ష్మీపార్వతి. ఎందుకంటే బాలక్రిష్ణకు ఏమీ తెలియదు. తనకు ఎవరైనా డైలాగులు రాస్తే వాటిని బట్టీపెట్టి చదవడం అతనికి అలవాటు. అంతేగానీ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం తెలియదు. బుల్.. బుల్.. అన్నాడు... దీన్నిబట్టి అందరికీ అర్థమైపోయింది కదా. ఆయన ఎంతమాత్రం మాట్లాడతారనేది.
 
బాలక్రిష్ణ అనసవరంగా ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అతనికి ఆలోచన లేదు. పదిమందితో ఎలా ఉండాలో తెలియదు. అసలు బాలక్రిష్ణ ఎవరో నాకు తెలియదని కొంతమంది నటులు అన్నమాటలు నిజమనే చెప్పుకోవాలి. అతని గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అంటోంది లక్ష్మీపార్వతి. లేకుంటే మనకు ఉన్న కనీస జ్ఞానం కూడా పోతుందంటోంది లక్ష్మీపార్వతి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు