ఇకపోతే సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రమోషన్ సమయంలో నయనతార మొండిచెయ్యి చూపించింది. తను చిత్రం ప్రమోషన్లకు వస్తే ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయనీ, అందువల్ల సెంటిమెంటుగా తను చిత్ర ప్రమోషన్లకు దూరంగా వున్నట్లు చెప్పింది.
ఐతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం నయనతార పేరెత్తకుండానే మెత్తగా తిట్టేశారు. తమన్నా గురించి మాట్లాడుతూ... తమన్నా అద్భుతం, తన నటన సంగతి పక్కన పెడితే ఆమె నటన ఎంతో బావుందని ఆకాశానికెత్తేశారు. మొత్తమ్మీద మెగాస్టార్ చిరంజీవికి నయనతారపై బాగా గుర్రుగా వున్నట్లే వున్నారు.