ఇప్పటి కాలంలో రోజుకు తింటున్నారో లేదా కానీ, మొబైల్ ఫోన్స్ మాత్రం ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే టిక్ టాక్ యాప్. ఈ యాప్‌ను కొన్నిరోజుల పాటు నిషేధించారు. టిక్ టాక్ యాప్ నిషేధంతో చాలామంది తీవ్రమైన అసహానం చెందారు. మేమంతా టిక్ టాక్‌తో తమాషా వీడియోలు చేసుకుని కాలక్షేపం చేస్తుంటామనీ.. అలాంటి యాప్ పైన నిషేధం ఏంటని విమర్శించారు.
దాని వలన కానీ, మరి దేనివలనో కానీ టిక్ టాక్ యాప్ పైన వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనితో మళ్లీ నెటిజన్లు వీడియోలు చేసి షేర్ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. నిషేధం విధించిన చైనా యాప్ టిక్ టాక్‌ను అనుమతిస్తున్నట్టు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ తమకు ఈ యాప్ ఇప్పటికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో యూజర్లకు అందుబాటులో లేదు.
దీనిపై హైకోర్టు నుండి తమకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే తాము ఆయా సంస్థలతో అధికారికంగా మాట్లాడుతామని సమాచార, సాంకేతిక, మంత్రిత్వ శాఖలోని ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. ఈ యాప్‌పైతాము విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు ఇటీవల మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 3న కేంద్ర ఐటీ శాఖ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో యాప్‌లు లభ్యం కాకుండా చేయాలని సూచించిన విషయం తెలిసిందే.