అయితే ఇద్దరు సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటూ వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు కొందరు భక్తులు. ఓ గరాటుకు అమర్చిన పైపు ద్వారా, ఒంగకుండానే ఒకరు కర్పూరాన్ని మెట్టుపై ఉంచుతుండగా, ఇంకో వ్యక్తి మాత్రం పొడుగాటి కర్రకు మంట వెలిగించి ఆ కర్పూరాలను అంటించుకుంటూ వెళ్తున్నాడు.
కొందరు భక్తులు ఈ ఐడియా బాగానే ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి, సుఖానికి కష్టం లేకుండా చెల్లించే స్థాయికి భక్తుల ఆలోచలు వచ్చాయి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ఇద్దరికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.