ఆహారం కోసం రయ్‌మంటూ కారువైపుకు దూసుకొచ్చిన జిరాఫీ.. ఏకంగా కారు అద్దాల్లో నుంచి తలను లోపలికి దూర్చింది. అప్పటివరకూ పొడుగుకాళ్ల జిరాఫీని చూసి తెగ సంబరపడిన ఆ జంట.. దగ్గరిగా వచ్చేసరికి భయాందోళనలకు గురై బిగ్గరగా కేకలు వేశారు. కారులో నుంచి తలను వెనక్కి తీసుకొనే క్రమంలో జిరాఫీ తల కారు అద్దాలకు తగిలి పగిలిపోయాయి.
దంపతుల చేతిలో ఆహారాన్ని అందుకునేందుకు కారులో జిరాఫీ తల లోపలికి పెట్టిందని సఫారీ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనలో జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని.. జిరాఫీ కూడా ఆహారం తీసుకున్నాక కారు నుంచి తలను బయటికి తీసేయడంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.