వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిలిచిపోయాయి. వినియోగదారులు సోమవారం సాయంత్రం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మూడు యాప్‌లు ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్నాయి. ఇవి షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నడుస్తాయి.
కాగా ఈ యాప్ లు పనిచేయకపోవడంపై ఫేస్ బుక్ తన వెబ్ సైట్లో.. క్షమించండి, ఏదో తప్పు జరిగింది. మేము దానిపై పని చేస్తున్నాము. వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరిస్తాము అని సందేశం పెట్టింది. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల నుండి అందుబాటులో ఉండవని వినియోగదారులు ట్విట్టర్‌లో సందేశాలను పోస్ట్ చేసారు.