వారంతా సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని తవ్వుకుని తెచ్చుకునేందుకు సంచులు, గోతాలు, ఆఖరికి దుప్పట్లు సైతం తీసుకుని పరుగులుపెట్టారు. బంగారం కొండను తవ్వి ఆ మట్టిని తీసుకొని బంగారాన్ని కడగడం, మట్టిని తొలగించి చిన్నచిన్న బంగారు ముద్దలను వేరు చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఇక్కడి నుండి అనేక టన్నుల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి, తూర్పు పొరుగు దేశాల ద్వారా ప్రపంచ సరఫరా మార్కెట్‌కు పంపుతారు. ఈ కారణంగా, కాంగో ప్రభుత్వానికి ఈ బంగారం నుండి ప్రత్యేక ప్రయోజనం లభించడంలేదు. ఈ కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.