ఒక్క విగ్రహానికి 200 కోట్లు... కోట్లాది మహిళా రక్షణకు 150 కోట్లా?

గురువారం, 10 జులై 2014 (17:14 IST)
2014- 15 సంవత్సారానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ గత ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణలకు కొనసాగింపులు తప్ప.. ఎటువంటి కొత్త సంస్కరణలకూ ఊతం పోయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం... ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా ఆదుకుంటామంటూ చెప్పిన మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు(15,600 కోట్లు)కు సంబంధించి ఒక్క పైసా కూడా కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించలేదు.
 
ఐఐటీలు, కారిడార్లు, వర్శిటీలు కేటాయించినా కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక పరిపుష్టిని పెంచే విధంగా ఎటువంటి కేటాయింపులూ జరుగలేదంటూ వాపోతున్నారు ఆంధ్రప్రాంత మేధావులు. స్మార్ట్స్ సిటీల కోసం ఏడువేల కోట్ల రూపాయలు. రైతులకు ప్రధాన మంత్రి కృషి యోజన స్కీమ్ అనే కొత్త పథకాన్ని, స్కిల్ ఇండియా అనే కొత్త పథకానికి పెద్దపీట దక్కింది.  
 
ఇదంతా ఒక ఎత్తయితే గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిమిత్తం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి నగరాల్లో ఉన్న కోట్లాది మహిళా రక్షణకు మాత్రం రూ. 150 కోట్లు కేటాయించడంపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క విగ్రహానికి 200 కోట్లు... కోట్లాదిగా ఉన్న మహిళలకు 150 కోట్లా అంటూ విమర్శిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి