వేతన జీవులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఐదు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. ఆమె శనివారం లోక్‌సభలో 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఈ విషయాన్ని వెల్లడించారు.
అలాగే, ఐదు నుంచి 7.5 లక్షల రూపాయల ఆదాయం ఉంటే పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వుంటే 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయం వరకు 20 శాతం పన్ను, 15 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె ప్రకటించారు.
రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు 20 శాతం పన్ను