అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (11:55 IST)
దేశంలోని అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. పథకాన్ని విస్తరించడంతో దాదాపు 2.5 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 2000-09 సంవత్సరానికిగాను విద్యారంగానికి రూ. 34,100 కోట్లను కేటాయించడంతో విద్యారంగం కేటాయింపులో 20 శాతం వృద్ధిని చూపిస్తున్నట్లు వెల్లడించారు.

బీహార్, ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు ఒకటి చొప్పున మూడు ఐఐటీలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్మికులకు వేతనాన్ని రూ. 1500 కు పెంచుతున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి