బడ్జెట్ దెబ్బకు కుదేలవుతున్న సెన్సెక్స్

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (12:28 IST)
2008-09 వార్షిక బడ్జెట్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా.. విత్తమంత్రి చిదంబరం తన ప్రసంగంలో రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడం మార్కెట్ వర్గాలను చావుదెబ్బ తీసింది. రైతు రుణాల మాఫీ భారాన్ని ఏ వర్గంపై మోపనున్నారనే చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

చిదంబరం ప్రకటనలో రుణాల మాఫీ భారం 60 వేల కోట్ల రూపాయల మేరకు వుండటం మార్కెట్‌ను ప్రభావితం చేసింది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే 229.50 పాయింట్ల మేరకు సెన్సెక్స్ కోల్పోయింది. అలాగే.. నిఫ్టీ సైతం 130 పాయింట్లు కోల్పోయి తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి