బడ్జెట్‌పై ప్రధాన రాజకీయ నేతల స్పందనలు....

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (18:24 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కింది విధంగా స్పందించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పందిస్తూ అద్భుతమైన బడ్జెట్‌గా వ్యాఖ్యానించారు. అలాగే మిగిలిన నేతల స్పందనలు ఇలా వున్నాయి...

విప్లవాత్మక నిర్ణయం..
రైతుల రుణాల మాఫీ చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన విప్లవాత్మక నిర్ణయం లాంటిదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. విత్తమంత్రి చిదంబరం మంచి నిర్ణయం ప్రకటించారన్నారు.

ఎన్నికల బడ్జెట్.. భాజప
గత నాలుగేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న చలించని యూపీఏ ప్రభుత్వం తాజాగా వారిపై వరాల జల్లులు కురిపిచండ ఎన్నికల స్టంట్ లాంటిదని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జరుగనున్న యూపీఏ ఎన్నికల మేనిఫెస్టోగా ఆ పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు.

దూరదృష్టిలేని బడ్జెట్.. సీపీ
2008-09 వార్షిక బడ్జెట్ దూరదృష్టిలేని బడ్జెట్ లాంటిదని సిపిఐ నేత డి.రాజా ఆరోపించారు. విత్తమంత్రి చేసిన ప్రసంగ పాఠం అంతా ఎన్నికల ప్రసంగంలా సాగిందని, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎన్నికల స్టంట్ బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

పసలేని బడ్జెట్.... చంద్రబాబ
తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఏమాత్రం పసలేనిదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ బడ్జెట్ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తుందని ఆయన విమర్శించారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో యూపీఏ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి