ప్రేమ బంధం... పెళ్లితో అనుబంధం... కానీ విడాకుల కోసం....

సోమవారం, 28 జనవరి 2013 (16:21 IST)
FILE
ఆధునిక కాలంలో ప్రేమ వివాహాలు మామూలైపోయాయి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గల సాన్నిహిత్యంతో ప్రేమ వివాహాలకు అతి సులభంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల మనస్సును అర్థం చేసుకుని వారికి ప్రేమ వివాహానికే ఓకే చెప్పేయడం ద్వారా.. ప్రేమ వివాహాలు ప్రస్తుతం తల్లిదండ్రులు, బంధువుల ఆశీర్వాదంతో జరుగుతున్నాయి.

దీనినిబట్టి ప్రేమ వివాహాలకు విలన్లే కరువయ్యారు. ఇది ఒకింత సంతోషాన్నిచ్చే అంశమే. అయినా వారి జీవితంలోకి అభిప్రాయ భేదాలనే విలన్‌ను ఆహ్వానిస్తున్నారు ప్రేమికులు.

ప్రేమను తొలుత ప్రేయసితో తెలియజేసేందుకు జడుసుకునే రోజులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. నేటి యువత ప్రేయసితో లవ్ చెప్పాలంటే సింపుల్‌గా మొబైల్, మెయిల్, ఫేస్‌బుక్, చాటింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఇలా సులభంగా ప్రేమాయణం సాగిపోతుంది.. అంతేవేగంగా ఎన్నో ప్రేమలు విఫలమవుతున్నాయి. ఇది మహిళలు, పురషుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ప్రేయసి ఓకే చెప్పేసిన వెంటనే ప్రేమికుడు మంచి చదువు, మంచి జీతం ఉన్న అమ్మాయి అయితే వెంటనే తల్లిదండ్రుల సమ్మతంతో ప్రేయసిని సతీమణిగా చేసేసుకుంటున్నాడు.

ఇలా అతివేగంతో జరిగిపోయే వివాహాలు కొన్ని చేదు అనుభవాలను మిగిలుస్తున్నాయి. పెళ్లికి ముందు ప్రేయసి, ప్రియుడుల మధ్య గల ప్రేమ, పెళ్లయిన వెంటనే మాయమైపోతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న అనేకమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరిపై ఒకరు చిర్రుబుర్రుమనుకుంటూ కాలంగడుపుతూ వున్నారు. ఇది అలా.. మనస్పర్దలు, ఇగో వంటి సమస్యలకు దారితీసి.. చివరికి విడాకుల వరకు వెళ్లి శాశ్వతంగా దూరమయ్యేలా చేస్తున్నాయి.

విడాకుల వరకు వెళ్లేంత దశకు చేరుకుని ప్రేమ చేదెక్కిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రేమికుల పైనే ఉంది. ప్రేమ వివాహం జరిగిన తొలి రోజు నుంచి జీవితం చివరి వరకు ప్రేమ, ఆప్యాయత, సహనం, ఓర్పు వంటి గుణాలను కలిగివుంటే మీ ప్రేయసి.. మీకు ప్రియమైన సతీమణిగా జీవితాంతం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి