ఇంటి నిర్మాణంలో రంగుల ఎంపిక

గురువారం, 26 జూన్ 2008 (17:41 IST)
WD PhotoWD
రోజురోజుకి పెరుగుతున్న నాగరికతకు అనుగుణంగా భవనాలు నిర్మించడం పరిపాటి అయిన నేపథ్యంలో, ఇంటి నిర్మాణంలో రంగుల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ప్రస్తుతం గృహాలు, వాణిజ్య సముదాయాలు రంగుల ఎంపికతో నిర్మించడం ద్వారా చూపరులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కొందరికి ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగుల్ని ఎంచుకోవాలన్న విషయం సందేహాలు తలెత్తడం సహజమే. రంగులను ఎంచుకోవడం కీలకమని మనిషి పెరుగుదల, పేరు ప్రతిష్టలు అర్జనలో రంగులు కీలక పాత్ర వహిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగులు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

వ్యాపార కార్యకలాపాలు వృద్ధిలో నలుపు రంగుతోను, పేరు ప్రఖ్యాతులకు ఎరుపు రంగుతోను అవినాభావ సంభంధం ఉందని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక గృహానికి లేదా వాణిజ్య సముదాయానికి వాడబడే రంగులను బట్టే మనలో ఉత్సాహం, శక్తి పెరుగుతుందని, అందువల్ల గృహానికి అనుకూలమైన రంగులు వాడడం కూడా చాలా అవసరమని వాస్తు చెబుతోంది. గృహమే కాకుండా వంటగది, పడకగది, ఆఫీసు గది, పూజగది, బాత్‌రూం ఇలా ఏదైనా కావచ్చు వాటికి ఉపయోగించే రంగులు, అక్కడ ఉండే వ్యక్తుల అభిరుచికి తగినట్టుగా వుండాలి.

వెబ్దునియా పై చదవండి