ఇంద్రుని దోషంతోనే మహిళలకు బహిష్ఠు: తూర్పు దిశ మూతబడితే..?

గురువారం, 10 జనవరి 2013 (18:20 IST)
FILE
అష్టదిక్కుల్లో ఈశాన్యమే శుభఫలితాలను ఇస్తుంది. ఈశాన్య, ఆగ్నేయ దిశలు వాస్తు పరంగా ఆ గృహ యజమానులకు అన్ని విధాలా అనుకూలిస్తాయి. ఆడ, మగలా ఈశాన్య, ఆగ్నేయాలు కలిసివుండే తూర్పు దిశకు అనుగుణంగా మీ ఇంటి నిర్మాణం ఉంటే ఆ గృహస్థులు అష్టైశ్వర్యాలతో జీవిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

తూర్పు దిశనే ఇంద్ర దిశ అంటారు. ఇంద్రుడు దేవతలకు అధిపతి. కుబేరుడు, వాయు, వరుణుడు, అగ్నిదేవుళ్లు ఇంద్రుని ఆధిక్యంలో ఉంటారు. ఇంద్రుడు అంటే "ఇంద్రియం"అనే అర్థం ఉంది. అందుచేత ఇంద్రుని దిశగా పేర్కొనబడుతున్న తూర్పు దిశ సంతానవృద్ధికి, సుఖమయ జీవితానికి బాసటగా నిలుస్తుంది.

ఇంద్ర దిశకు అధిపతి సూర్యుడు. సూర్యుడు లేకుంటే ప్రపంచమే లేదు. బ్రహ్మహత్యాదోషము దోషానికి గురైన ఇంద్రుడు ఆ దోషాన్ని భూమాత వద్ద కొంచెం, వృక్షాల వద్ద కొంచెం, మహిళల వద్ద కొంచెం ఇచ్చినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దోషంతోనే మహిళలకు బహిష్ఠు ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి.

పూర్వము త్వష్టయను ప్రజాపతికి సర్వజ్ఞుడైన విశ్వరూపుడను కొడుకు పుట్టెను. అతనికి మూడు తలలు. దేవతలతనిని గురువుగా భావించిరి. ఇంద్రుడు అతని వద్ద ''నారాయణ కవచము'' ఉపదేశము పొందెను. విశ్వరూపు డొక నోట సురాపానము, ఒక నోట సోమపానము చేయును. ముడవనోటితో అన్నం దినును.

అతడు రాక్షసులకు గూడా యజ్ఞ భాగము లిప్పించుచుడగా ఇంద్రుడతని తలలు ఖండించెను. దానివలన అతనికి బ్రహ్మహత్యాదోషము కలిగెను. దానినొక ఏడు భరించి అది పోగొట్టుకోనుటకై ఇంద్రుడు, ఎంత గోయియ్యైనపూడునట్లు వరమిచ్చి భూమికి నలుగవంతు పాపమును, ఎన్ని కశ్మలములు చేరినను పవిత్రమగునట్లు వరమిచ్చి నీటికొక నాలుగవ వంతును , ఎన్నిసార్లు కొట్టివేసినను చిగిరించునట్లు వరమిచ్చి చెట్లుకొక నాలుగవ వంతును, కామసుఖములతో పాటు సంతానము గూడా కలుగునట్లు వరమిచ్చి స్త్రీల కొక నాలుగవ వంతును అపాపమును పంచి ఇచ్చి తానా బ్రహ్మహత్యాదోషమునుండి విముక్తుడయ్యేను.

అయితే ఇంద్రుడు ఇచ్చిన పాపంలో కొంచెం భాగంతోనే మహిళలకు నెలసరి తప్పట్లేదని పండితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఇంట్లో ఇంద్రుని దిశ అయిన తూర్పు మూతబడితే ఎలాంటి మంచి ఫలితాలు ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంకా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు, మానసిక ఆవేదనలకు తూర్పు దిశ మూతపడటమే కారణమని, అందుచేత సుఖమయ జీవితానికి ఇంద్రుని అనుగ్రహం పొందిన తూర్పు దిశను తెరచివుంచడమే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి