ఇరుకైన చిన్న స్థలంలో ఇల్లు కట్టే వారు...

శుక్రవారం, 24 ఆగస్టు 2007 (18:18 IST)
ఇరుకైన చిన్న స్థలంలో ఇల్లు కట్టే వారు, విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వారు మరింత శ్రద్ధ వహించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది.. బాల్కనీలో ఎలా ఉందీ అన్న విషయాలు ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం తప్పనిసరి. గోడలు నిర్మించి అటకులు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి