ఏ దిశలో ఏ గది ఉండాలో తెలుసా..?

ఇంటి నిర్మాణంలో గదుల ఏర్పాటుకు వాస్తుశాస్త్రాన్ని అనుసరించడం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వాస్తు నిర్ణయించిన దిశల్లోనే గదులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈశాన్య దిశలో పూజగదిని ఏర్పాటు చేసుకుంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది.

ఇకపోతే.. తూర్పున స్నానాల గది, ఆగ్నేయంలో వంటగది, దక్షిణ దిశలో పడకగది, దక్షిణ నైరుతి దిశల మధ్యన మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా.. నైరుతి దిశలో ఆయుధాల గది, పడమర దిక్కున భోజనాల గది, పశ్చిమ నైరుతి దిశల మధ్య విద్యాభ్యాస మందిరాన్ని నిర్మించుకుంటే శుభ ఫలితాలు చేకూరుతాయి. వాయువ్య దిశలో పశుశాల, ఉత్తర దిశలో ధనాగారం (బీరువాలు, బంగారం దాచిపెట్టే పెట్టెలు) ఉండాలని వాస్తు చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి