ఏ దిశలో తలవుంచి నిద్రిస్తున్నారు..?

మీ గృహంలో దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఉత్తర దిశలలో పడకగదులు నిర్మించడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య దిశలలో పడక గదుల నిర్మాణం మంచిది కాదు. పడక గదిలో మంచాలు దక్షిణ-పశ్చిమ-ఉత్తర-నైరుతి-వాయువ్య దిశలలో ఉండవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఏ గదినైనా ఉత్తర-ఈశాన్య-తూర్పు దిశలలో నడకకు కొంత ఖాళీ స్థలం వుంచాలి. మంచాలు, కుర్చీలు, సోఫాలు, బీరువాలను పై దిశలలో గోడలకు ఆనించి మూతవేయకూడదు. ధనం, ఆభరణాదులు గల బీరువాలను దక్షిణ, పశ్చిమ దిశ గోడలకు ఆన్చి, ఉత్తర-తూర్పు దిశలకు ఎదురుగా అమర్చుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలవుంచి నిద్రించడం మంచిది కాదు. ఇలా నిద్రిస్తే దుష్పలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇకపోతే.. తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశలలో తలవుంచి నిద్రించడం శ్రేయస్కరం.

వెబ్దునియా పై చదవండి