గృహానికి దక్షిణ పశ్చిమాలు జరుగవచ్చా...

ఆదివారం, 18 నవంబరు 2007 (17:30 IST)
WD
అన్ని విషయాలు పరిశీలించి శాస్త్రరీత్యా నిర్మాణం చేపట్టిన తర్వాత నిర్మాణానికి ఎటువైపు పెంచినా శాస్త్రానికి వ్యతిరేకమే. వాస్తు దోషం సరిచేసే నిమిత్తం, ఇంటికి ఎటువైపునైనా స్థలాన్ని కలుపుకోవచ్చు. అయితే ఇలా చేసేటపుడు ప్రత్యేకించి వాస్తు శాస్త్రజ్ఞుల సలహాలను తీసుకోవాలి.

ఉదాహరణకు దక్షిణ, పశ్చిమాలలో ఎక్కువగా ఖాళీ ఉండి, వాస్తు దోషంగా ఉన్నప్పుడు దక్షిణ, పశ్చిమాలలో వేరే రూమ్ లేదా పోర్షన్ వేయటం తప్పుకాదు. మన ఇంటి ఆవరణ దాటిన తర్వాత వేరే ప్లాటును ఏ దిశలోనైనా తీసుకోవచ్చు. కాని మన గృహావరణలో నుంచి తీసుకున్న ప్లాటు ఏ దిశలోనైనా తీసుకోవచ్చు. అయితే మన గృహావరణలో నుంచి తీసుకున్న ప్లాటుకు దారి ఉండకూడదు. అంటే వేరే ప్లాటుగా ఉండాలి. దారి పెట్టాల్సి వస్తే మాత్రం వాస్తుపరంగా చాలా విషయాలను పరిశీలించి ఆ తర్వాతే ముందడుగు వేయాలి.

వెబ్దునియా పై చదవండి