గోడలవల్ల కలుగు చెడుఫలితాలు

గురువారం, 3 జులై 2008 (18:27 IST)
WD
పునాదులు, గోడలు, పిట్టగోడలను నిర్మించుట శాస్త్రబద్దంగా ఉండాలని వాస్తునిపుణులు అంటున్నారు. వీటిని శాస్త్రవిరుద్ధంగా నిర్మించినట్లైతే పలు దోషములు కలిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. గృహమునకు గోడలచే కలిగే దోషాలు 20 రకాలుగా ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గృహములో గోడలు ఎటు చూసినా సమానంగా, హెచ్చుతగ్గులు లేనివిధంగా ఉండాలి. అదే విధంగా వంకరలు లేకుండాను, నాలుగు పలకలుగాను, పటిష్టంగాను, ప్రమాణయుతంగాను పైపూతగలదిగాను కట్టుట మంచిదని శాస్త్రాలు అంటున్నాయి. అనతికాలంలో కొందరు బాధ్యతారహితంగా నిర్మించడం ద్వారా, కొన్ని దోషములు సంభవిస్తాయని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కొందరు తమ ఇంటి నిర్మాణంలో గోడలను మందంగానూ, ఎత్తుగానూ, హెచ్చుతగ్గులుగా నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణంలో గోడల నిర్మాణం ఏవిధంగా అమరి ఉండాలనే అంశంపై వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం ఉత్తమమని విశ్లేషకుల భావన.

కొన్ని గృహాల్లో కొన్నిశ్లాబ్‌లు, గోడలు కొంతకాలానికే బీటలు వారిపోవడం, ఇటుకలు వెలుపలకు ఉబికి వచ్చుట వంటి అశాస్త్రీయ నిర్మాణములని వారు చెబుతున్నారు. ఇట్టి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి