పాముల పుట్టలున్న స్థలంలో ఇల్లు నిర్మిస్తే జరిగే నష్టమేంటి?

మంగళవారం, 29 జనవరి 2013 (18:13 IST)
File
FILE
అనేక మంది అతి తక్కువ కాలంలోనే ఇంటిని నిర్మించాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం వాస్తు నియమాలను సైతం తుంగలో తొక్కేస్తుంటారు. అంటే.. అనతికాలంలోనే ఇంటిని నిర్మించాలన్న పట్టుదలతో వారు బాధ్యతారహితంగా నడుకుంటారని చెప్పొచ్చు.

నిజానికి ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలని భావిస్తే.. ముందు ఆ ఇంటిని నిర్మించబోయే స్థలం ఎలాంటిదో ఒకసారి పరిశీలించాలి. ముఖ్యంగా ఆ స్థలం వంకర టింకరలు లేకుండా నిర్మాణానికి అనుకూలంగా ఉందా లేదా అన్నది తొలుత చూడాలి. ఆ తర్వాత ఆ ఇంటికి వాస్తు అనుకూలంగా ఉందో లేదో నిపుణుల ద్వారా తెలుసుకోవాలి.

పిమ్మట ఈ స్థలంలో ఎలాంటి జీవరాసులు తిరుగుతున్నాయన్న అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే పాముల పుట్టలు, చీమలు, కప్పలు, ఎముకలు, బూడిద, కాలిపోయిన వస్తువులు గల స్థలంను ఇంటి నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

ఇలాంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం చేపడితే మరణ రోగాలు కలుగుతాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే, ముళ్ల పొదలు, సమాధులు, బీటలువారిన భూములు, ముళ్లతో కూడిన వృక్షాలు ఉన్న స్థలాలు ఇంటి నిర్మాణానికి అనుకూలం కాదని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి