మల్లె - అరటి - పనస వృక్షాలు ఉంటే.. ఇంటి నిర్మాణానికి భేష్!

శనివారం, 2 ఫిబ్రవరి 2013 (15:52 IST)
FILE
గృహ నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా చేపట్టాలని. ఇంటి నిర్మాణంలోకి దిగే ముందుగా ఇంటిని నిర్మించబోయే స్థలానికి భూపరీక్ష చేయడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, మల్లె, అరటి, పనస, తెల్లగన్నేరు వంటి వృక్షాలు పచ్చగా ఉన్నట్టయితే, ఆ స్థలంలో నిర్మించే సుఖసంతోషాలతో వర్థిల్లుతూ ఉంటుందని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

అలాగే, గోవులు, కుందేళ్లు, తోడేల్ళు, పిల్లులు, ఉడుతలు, ముంగిసలు వంటివి సంచరించే స్థలాలు కూడా ఇంటి నిర్మాణానికి ఎంతో శ్రేష్టమైనవని వారు చెపుతున్నారు. అయితే, పాములు, ఎముకలు, చీమలు, కప్పలు వంటివి సంచరించే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టరాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి