మీ పడకగదిలో డ్రెస్సింగ్ రూమ్‌ ఏ దిశలో ఉండాలి?

FILE
డ్రెసింగ్ పడకగదిలో తూర్పు ఆగ్నేయంలో మనం తూర్పు ముఖం పెట్టుకునే విధంగా లేదా గదికి ఉత్తర వాయవ్యంలో మనం ఉత్తర ముఖం చేసుకుని కూర్చునే విధంగా అమర్చుకోవాలి. అద్దాలు బెడ్‌కు ఎదురుగా ఉండకూడదని వాస్తు చెబుతోంది.

అందుచేత మీ పడకగదిలో పైన చెప్పినట్లు డ్రెస్సింగ్ ఏర్పాటు చేసుకుంటే నిద్రించే మంచం గది వెడల్పును బట్టి అద్దానికి అడ్డురావు. ఎందుకంటే దక్షిణ భాగంలో, పడమర భాగంలో మంచాలు వస్తాయి కాబట్టి.

ఒకవేళ వచ్చినా దోషం లేదు. కారణం భార్యాభర్తలే ఆ గదిని వాడుకోవటంతో దోషాలుండవు. అందులో వారి రూపాలు కనబడినా అవి మనసుకు ప్రోత్సాహంగానే ఉంటాయి. కనుక ఇబ్బంది ఉండదు.

వెబ్దునియా పై చదవండి