వాస్తు ప్రకారం ఇంటిని స్వర్గధామంలా మార్చుకోండి!

శనివారం, 17 మే 2014 (15:11 IST)
మీ ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఉండదు. పట్టణాలలో, మహా నగరాలలో ఫ్లాట్ల సంస్కృతి నడుస్తోంది. ఫ్లాట్లలో సామాన్లు తరలించడానికి నానాయాతనలు పడాల్సివస్తుంది.

దీంతో మన వస్తువులెన్నో పగిలి పోవడం, లేదా పాడైపోవడం పరిపాటే. దీనికి సమాధానంగా బాడుగ ఇండ్లను కూడా అందంగా అలంకరించుకోవడానికి కొన్ని చిట్కాలు మీ కోసం.. వీటిని మీరు పాటిస్తే బాడుగ ఇల్లు కూడా స్వర్గధామంలా మారుతుందనడంలో సందేహంలేదు.

* చిట్కాలు
* మీరు పడుకునే మంచం, దీవాన్‌, సోఫాలను ఒక పెట్టెలా తయారు చేయించుకోండి. ఇందులో కొన్ని వస్తువులను ఇల్లు మార్చేటప్పుడు భద్రపరచుకోవచ్చు. దీన్ని ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి తరలించడానికి ఆస్కారముంటుంది.

* షోకేస్, డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి కొనేటప్పుడు అవి దృఢంగా ఉండేట్లు చూసుకోండి. అవి కాస్త నాజూకుగావుంటే ప్రమాదం.

* మీ పిల్లలుకు పెయింటింగ్ వేసే అలవాటుంటే వారి కోసం ప్రత్యేకంగా వారి గదిలో ఒక బ్లాక్ బోర్డు ఉంచండి. దానిపై వారు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలరు.

* ఇంట్లో పనికి రాని వస్తువులను చేర్చుకోకండి.

* గోడలపై చీలలు (మేకులు) ఎక్కువగా కొట్టకండి.

* ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ మీకు ఎంతో శ్రేయస్కరం కాగలదు.

* బాడుగ ఇండ్లల్లోని అలమారాలలో తలుపులు లేకపోతే వాటికి తలుపులు బిగించుకుని మీరు ఎంచక్కా వాటిని వాడుకోవచ్చు. వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఇంకా వాస్తు ప్రకారం ఇంట్లో పనికి రాని వస్తువులను ఉంచకూడదు.

వెబ్దునియా పై చదవండి