వాస్తు... స్నానం చేసేటపుడు ఏ ముఖంగా స్నానం చేస్తున్నారు...?

బుధవారం, 10 జులై 2013 (17:11 IST)
WD
స్నానం చేస్తున్నప్పుడు ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరము వైపుకు ఉంచి చేయాలని వాస్తు శాస్త్రం చెపుతోంది. ఇంక స్నానం గదులను ఏర్పాటు చేసుకునేటపుడు తూర్పు ఆగ్నేయము నందు, దక్షిణ ఆగ్నేయము నందు, ఉత్తర వాయవ్యము నందు, పడమర వాయవ్యము నందు తూర్పు ఉత్తరపు ప్రహరీ గోడలను తాకకుండా ఉండేట్లుగా, ఇంటిని తాకకుండా ఉండేట్లుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

ఈశాన్య దిక్కులో స్నానపు గదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదు. అది అశుభకరం. స్నానపు గదులకు తూర్పు ఉత్తరములందు మాత్రమే ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి