శని గ్రహం మరింత తేజస్సును సంతరించుకుంటుందట!!

గురువారం, 2 మే 2013 (14:04 IST)
File
FILE
చాలా గ్రహాలు వయస్సు పెరిగే కొద్ది కాంతి విహీనంగా మారడం సహజం. కానీ శని గ్రహం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందట. ఈ గ్రహానికి వయస్సు పెరిగే కొద్దీ తేజస్సును సంతరించుకుంటూ మరింతగా కళకళలాడిపోతోందట.

దీనికి గల కారణాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన పరిశోధకులు శనిగ్రహం తేజస్సు మరింతగా పెరగడానికి గల కారణాన్ని కనుగొన్నారు. శనిగ్రహంలో ఉన్న తేజస్సుకు అంతర్గత వాయువులే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

శనిగ్రహంలో అంతర్గతంగా ఉత్పన్నమయ్యే వాయువు పొరలు గ్రహంలోని వేడిని బయటికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాయని, దీని కారణంగా ఆ గ్రహం చల్లబడకుండా వెలుగులీనుతోందని ఎక్స్‌టెర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్‌ గిల్లెస్‌ ఛాబ్రియెర్‌ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి