ఇంటిలో ఏ దిక్కున బీరువా పెట్టుకోవచ్చు?

సోమవారం, 12 మే 2014 (16:28 IST)
File
FILE
సాధారణంగా ఇంటిలో కుబేర మూలలో బీరువాలను పెట్టుకుంటుంటారు. మరికొందరు వారికి ఇష్టమొచ్చిన దిక్కుల్లో వీటిని ఉంచుతారు. వాస్తవంగా నైరతి లేదా వాయువ్య దిక్కుల్లో బీరువాలు పెట్టుకోవచ్చా అనే సందేహం అనేక మందిని వేధిస్తూ ఉంటుంది.

ఇదే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. ధనం, ధాన్యం మొదలైన ఆర్థిక సంబంధమైన వాటిని నైరుతిలో పెట్టడం శాస్త్రీయత అని అంటున్నారు. అన్ని గదుల కన్నా నైరుతి గది యజమాని కనుసన్నల్లో ఉంటుందని, వాటి జమా, ఖర్చులు అన్నీ కూడా యజమాని నేతృత్వంలో జరపడానికి అనుకూలమైన గదిగా పేర్కొంటున్నారు.

ఎందుకంటే.. ఆ గదిని కుటుంబ యజమానులే వాడుతుంటారని చెపుతున్నారు. ఆ కోవలో బీరువాలలో ప్రధానమైనది దక్షిణ నైరుతిలో పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. లేదా పశ్చిమ నైరుతిలో కూడా పెట్టవచ్చని అంటున్నారు. రెండు బీరువాలు వచ్చినప్పుడు పక్కపక్కనే లేదా దక్షిణ నైరుతి ఒకటి, పశ్చిమ నైరుతి దిశలో ఒకటి పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి